నెల్లూరు వైఎస్ఆర్సిపిలో వర్గపోరులు భగ్గుమంటున్నాయి. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు హాజీ పై గత రాత్రి దాడి జరిగింది.
Anil kumar: నెల్లూరు వైఎస్ఆర్సిపిలో వర్గపోరులు భగ్గుమంటున్నాయి. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు హాజీ పై గత రాత్రి దాడి జరిగింది. హాజీ ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయనను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ పరామర్శించారు. ఈ సంఘటనకు కారణం మాజిమంత్రి అనిల్ కుమార్ అని ఆయనపై తీవ్రంగా ఆగ్రహించారు. ఇలాంటి దాడులు సరికాదని వ్యాఖ్యానించారు.
రూప్ కుమార్ యాదవ్ చేసిన వాఖ్యలపై అనిల్ కుమార్ మండిపడ్డారు. నెల్లూరులో ఏం జరిగినా నాపై బురద చల్లుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజీపై జరిగిన దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. గతంలో కూడా వీరి మధ్య వర్గపోరు నడిస్తే ఈ పంచాయితీ సీఎం జగన్ దాక వెళ్ళింది. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి వీరిద్దరిమద్య గొడవని సర్దుమణిగించారు. అయితే తాజాగా మరోసారి ఒకరిపై ఒకరు విమర్శలు పలు విమర్శలు చేసుకోవడంతో అధిష్టానానికి ఇది తలనొప్పిగా మారిందని స్థానిక నేతలంటున్నారు.