ఏపీ ప్రజలకు విద్యుత్ షాక్
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచింది ప్రభుత్వం. పెరిగిన విద్యుత్ టారీఫ్‌ను విడుదల చేశారు APERC ఛైర్మన్. మొదటి 30 యూనిట్ల వరకు రూపాయి 90 పైసలు పెంచినట్లు తెలిపారు. మరోవైపు 31 యూనిట్ల నుంచి 75 యునిట్ల వరకు యూనిట్‌కు 3 రూపాయలు పెంచినట్లు తెలిపారు. 76 నుంచి-125 యూనిట్ల వరకు యూనిట్‌కు 4 రూపాలయల 50 పైసలకు పెంచారు.
126-225 యూనిట్లకు యూనిట్ ధరను 6 రూపాలుగా నిర్ణయించింది ప్రభుత్వం. 226-400 యూనిట్ల వరకు యూనిట్ ధర 8 రూపాయల 75 పైసలుగా నిర్ణయించింది. అదే విధంగా 400 యూనిట్ల పైన విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు 9.75 రూపాయలుగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్ వినియోగంలో కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకువచ్చినట్లు ఏపీఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు.