Draupadi Murmu : రాష్రపతి అభ్యర్థికి ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం
Presidential Election – Draupadi Murmu arrives to Gannavaram Airport : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజేపి నాయకులు సోము వీర్రాజు, సియం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్, జివియల్ నర్సింహారావు విమానాశ్రయంలో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. ఇక వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మార్గని భారత్, మిథున్ రెడ్డి, మంత్రి జోగి రమేష్ కూడా ఆమెను స్వాగతించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకొని, అక్కడ నోవోటెల్ లో కాసేపు విరామం తీసుకోనున్నారు. అనంతరం సీఎం నివాసానికి ముర్ము చేరుకుంటారు.
ద్రౌపది ముర్ము షెడ్యూల్ విషయానికొస్తే… రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకోనున్న ముర్ముతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అనంతరం మంగళగిరి కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నేతలతో ముర్ము సమావేశం కానున్నారు. ఈరోజు సాయంత్రం సీఎం నివాసంలో తేనేటి విందు జరగనుంది. ఆ తరువాత విజయవాడలో ముర్ముతో టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు భేటీ కానున్నారు.