AP Scholar to R-Day: ఏపీ డాక్టర్ కు అరుదైన గౌరవం.. మోడీతో కలిసి!
PM Modi invites AP Medical Scholar Tejaswi for Republic Day celebrations: ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మెడికల్ స్కాలర్ కు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈమెయిల్ ద్వారా ఆమె ఆహ్వానం పంపారు. జనవరి 26వ తేదీన న్యూఢిల్లీలో ఆమె ప్రధానితో కలిసి రిపబ్లిక్ డే పరేడ్ వీక్షించబోతున్నారు.
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి తో కలిసి ప్రతిభావంతులైన 50 మంది విద్యార్థులకు ఈ మేరకు ఆహ్వానం పంపగా అందులో విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో సీనియర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బాణావతి తేజస్వికి కూడా ఆహ్వానం అందింది. నున్నలోని కెనడీ స్కూల్లో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు తర్వాత విజయవాడ భాష్యంలో పదో తరగతి వరకు చదివిన ఆమె శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 2013 ఎంసెట్లో మెరిట్ సాధించి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు సాధించి ఎంబిబిఎస్ పూర్తి చేసింది.
తేజస్వి కనపరిచిన ప్రతిభకు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ గోల్డ్ మెడల్స్ కూడా అందించింది. ఇక ఆ తర్వాత జోద్పూర్ ఎయిమ్స్ లో జనరల్ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె పీజీలో కూడా గోల్డ్ మెడల్ అందుకోవడం గమనార్హం. ఇక ఆమె తండ్రి వెంకటేశ్వర రావు విజయవాడలోని వాణిజ్య పనులు శాఖలో ఒక డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఇక ఆమెకు దక్కిన అరుదైన గౌరవం మరువలేనిదని ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.