అది ఫేక్ న్యూస్ విద్యార్థులు ఆందోళన చెందవద్దు
చిత్తూరు జిల్లా పరీక్షా సెంటర్‌లో పదో తరగతి పేపర్ లీకేజ్ అనేది తప్పుడు వార్త అని చిత్తూరు డీఈవో తెలిపారు. విద్యార్థులు, టీచర్ల సెల్‌ఫోన్స్ కబోడ్‌లో ఉంచామన్నారు. వాళ్లు పేపర్‌లను ఫోటోలు తీసే ఛాన్సే లేదన్నారు. ఈ వదంతుల వల్ల విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. వారి మానసిక ధైర్యం దెబ్బతిసే వార్తలను ప్రచారం చేయవద్దన్నారు. ఇలాంటి వార్తలను షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని డీఈవో హెచ్చరించారు.
మరోవైపు ఈ కేసులో టీచర్ గిరిధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతను నారాయణ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు తెలిపారు. గిరీధర్ రెడ్డి పదవ తరగతి పరీక్ష పేపర్‌ను చిత్తూరు వాట్సప్ గ్రూపులో షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు గిరీధర్ రెడ్డికి పేపర్లు ఎవరు పంపి ఉంటారనే దాని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.