DL Ravindra Reddy: వివేకాను ఎవరు చంపించారో జగన్‌కు తెలుసు.. త్వరలో వెల్లడి!
DL Ravindra Reddy Comments on Vivekananda Reddy Murder: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీలో ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. ఆయనను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయం మీద పోలీసులు కానీ సీబీఐ అధికారులు కానీ ఇప్పటికీ ఏమీ తేల్చలేక పోతున్నారు. ఈ కేసులో అనేక వర్ణనలు, ఊహాగానాలు తెరమీదకు వచ్చినా అసలు నిజం ఏమిటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే తాజాగా వివేకానంద రెడ్డి హత్య కేసు మీద మాజీ మంత్రి, వైసీపీ రెబల్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అసలు హంతకులు, ఆ హంతకులు వెనుక సూత్రధారులు ఎవరో సీబీఐ త్వరలోనే తేల్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున అది త్వరగా తేలి అన్ని విషయాలు బహిర్గతం అవుతాయని ఆయన అన్నారు. అసలు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు? ఎందుకు చంపించారు? అనే విషయం సీఎం జగన్ కు తెలుసని సీబీఐ అధికారులు బయట పెట్టక ముందే ముఖ్యమంత్రి అసలు హంతకుల పేర్లు బయట పెడితే బాగుంటుందని ఆయన కామెంట్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఆయన ప్రధానమంత్రి ఎర్ర గంగిరెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి పావుగా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ఇక త్వరలో సీబీఐ తాడేపల్లి ప్యాలెస్ ను కూడా విచారిస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు. అదే సమయంలో డిఎల్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీని భూస్థాపితం చేయకపోతే ఏపీ ప్రజలు బతికి బట్ట కట్టలేరని రాష్ట్రాన్ని వదిలి బయటకు వెళ్లి పోవాల్సి వస్తుందని జోష్యం చెప్పారు. ఇక ఈ విషయంలో ఎవరితోనైనా కలిసి పని చేస్తానని తెలిపిన ఆయన తెలుగుదేశం అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు ఆర్థికంగా బాగుంటుందని పేర్కొన్నారు. మరి ఈ విషయం మీద వైసీపీ నేతల నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూడాల్సి ఉంది