Divya Darshan Tokens for Devotees: గుడ్‌న్యూస్…నడకదారిలో భక్తులకు దివ్యదర్శన టోకెన్లు
Divya Darshan Tokens for Devotees: తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికోసం అధికారులు ఇప్పటికే అనేక ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. నడక మార్గంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. నడక దారిలో ఇప్పటికే అనేక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. అయితే, ఈ మార్గం ద్వారా వచ్చే భక్తుల్లో సుమారు 60 శాతం మంది వద్ద దివ్యదర్శనం టోకెన్లు ఉండటం లేదు. ఈ మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు అందించాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లను అందజేయనున్నారు.
ఇక ఇదిలా ఉంటే, తిరుమల గిరుల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు టీటీడీ ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నది. తొలివిడతగా 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను వచ్చే నెల నుండి ప్రారంభించనున్నారు. ఈ బస్సుల పనితీరును అనుసరించి మరికొన్ని బస్సులను పెంచే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇకపోతే, తిరుమలలో వైభవంగా వార్షిక తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం రోజున శ్రీవారు శ్రీరామచంద్రుడి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా, నేడు శ్రీవారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తెప్పోత్సవాల్లో భాగంగా పుష్కరిణి చుట్టూ శ్రీవారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మార్చి 7వ తేదీ వరకు ఈ సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి.