Minister Ambati Rambabu: భద్రాచలం తిరిగి ఇచ్చేస్తారా ?
Minister Ambati Rambabu Comments on Polavaram Project: తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్ట్‌పై వివాదం ముదురుతోంది. గోదావరి వదరలకు భద్రాచలం మునిగిపోవడంతో.. పోలవరం వల్లే భద్రాచలంలోని రాముని ఆలయం, పరిసర ప్రాంతాలు నీటమునిగాయని, ఉమ్మడి ఖంమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలవరం ఎత్తును తగ్గించాలని మంత్రి పువ్వాడ ఢిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపడాన్ని పువ్వాడ తప్పుబట్టారు. తాజాగా దీనిపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరంపై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్నవాళ్లు ఇలా మాట్లాడటం సిగ్గిచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ముంపు ఉంటుందని దూర దృష్టితో ఆలోచించే ఏడు మండలాలను ఏపీలో కలిపారన్నారు. పోలవరం ఎత్తు పెంపునకు సీడబ్ల్యూసీ అనుమతి ఉందని తెలిపారు.
పోలవరం విలీన మండలాలను మళ్లీ తెలంగాణలో కలపాలని కోరడం కుదరని పని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాము భద్రాచలం కావాలని అడిగితే ఇచ్చేస్తారా అని ఏపీ మంత్రి తెలంగాణ నేతలను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. పోలవరాన్ని 3 మీటర్ల ఎత్తు పెంచుతున్నామన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. పోలవరం ఎత్తుపై వివాదం మంచిది కాదని సూచించారు.