ఏపీ సచివాలయ ఉద్యోగుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోషల్ మీడియా వేదికగా సెక్రటేరియట్ ఉద్యోగ సంఘ సభ్యుల కామెంట్లు కాక రేపుతున్నాయి. వాట్సప్ ఛాట్ లలో, స్టేటస్‌లలో సచివాలయ ఉద్యోగుల రియాక్షన్లు ఆసక్తిరేపుతున్నాయి.
Differences among AP Secretariat employees
ఏపీ సచివాలయ ఉద్యోగుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోషల్ మీడియా వేదికగా సెక్రటేరియట్ ఉద్యోగ సంఘ సభ్యుల కామెంట్లు కాక రేపుతున్నాయి. వాట్సప్ ఛాట్ లలో, స్టేటస్‌లలో సచివాలయ ఉద్యోగుల రియాక్షన్లు ఆసక్తిరేపుతున్నాయి.
ప్రభుత్వం చెప్పిన దానికంటే ఉద్యోగులకు ఎక్కువే ఇచ్చిందంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన ప్రకటనపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వెంకట్రామిరెడ్డి చేసిన ప్రకటనపై ఏపీ సచివాలయ ఉద్యోగులు వాట్సప్ సందేశాల ద్వారా ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ఉద్యోగుల కనీస ప్రయోజనాలు, హామీలను నెరవేర్చకుండా ఇలాంటి ప్రకటనలు చేయటం సరికాదని ఉద్యోగులు భావిస్తున్నారు.
2018 జూలై నుంచి ఇప్పటి వరకూ డీఏ బకాయిలు చెల్లింపులు చేయలేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. 5 డిఏలకు సంబంధించిన ఆ బకాయిలన్నీ గ్రాస్ శాలరీతో సమానంగా ఉన్నాయని ఆక్షేపిస్తున్నారు. 11 పీఆర్సీలో 27 శాతం ఐఆర్ కంటే తక్కువగా 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించి ఉద్యోగుల్ని మోసం చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 10 పీఆర్సీ బకాయిలు ఆ ప్రభుత్వ కాలంలోనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారని స్పష్టం చేస్తున్నారు. లోన్లు, అడ్వాన్సుల విషయంలో ఒక్క రూపాయి కూడా పెంచిన దాఖలాలు లేవని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులకూ ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ ఏడాదిలోనే సామాన్య ఉద్యోగుల ప్రయోజనాలను నెరవేర్చేలా కృషి చేయాలని కొందరు ఉద్యోగులు హితవు పలుకుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఆధిపత్యం అంశాన్ని పక్కన పెట్టి సామాన్య ఉద్యోగుల ప్రయోజనాలు తీర్చేలా చూడాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు.