ఆయుర్వేదంలో పీజీ చేశారా?.. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకే..
ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?. అయితే మీ నిరీక్షణ ఇక ఫలించినట్లే. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజీలో 10 లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలలో ఉద్యోగం చేయాలనే ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి వేతనం నెలకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు ఇస్తారు. అప్లై చేసుకునేవారి వయసు 41 ఏళ్లు నిండకూడదు. అభ్యర్థులు ఆఫ్ లైన్ లోనే దరఖాస్తులు పంపాలి. సంహిత, సిద్ధాంత్, క్రియా శరీర్, ద్రవ్యగుణ, రసశాస్త్ర, అగడతంత్ర ఎవం విధి వైద్యక, శలక్య తంత్ర, పంచకర్మ సబ్జెక్టులు బోధించగలగాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా.. ఎస్వీ ఆయుర్వేదిక్ కాలేజీ, టీటీడీ, కేటీ రోడ్, తిరుపతి, 517502. వివరాలకు https://www.svaych.com వెబ్ సైట్ చూడొచ్చు.