Nara Devansh: ఆసక్తికరంగా తాతలతో నారా దేవాన్ష్ ఆటలు!
Devansh Games with Chandrababu – Balakrishna: తిరుపతి జిల్లా నాగాలమ్మ కట్ట వద్ద ఆసక్తికరంగా చంద్రబాబు, బాలకృష్ణ సహా వారి మనవడు దేవాన్ష్ ఆటలు సాగాయి. బాలకృష్ణ, చంద్రబాబును మనవడు దేవాన్ష్ ఆటపట్టించిన తీరు అక్కడి ఉన్న వారందరినీ అలరించింది. నాకు కావాలంటూ చంద్రబాబును కూర్చీలోంచి లేపిన దేవాన్ష్ ఆ తరువాత తాత బాలకృష్ణ తలపై నీళ్ల బాటిల్ తో సరదాగా కొట్టాడు. ఇక ఒకవైపు ఆలయం వద్ద మహిళలు పూజలు చేస్తుంటే …. మనవడితో బాబు, బాలయ్యలు ఆదుకున్నారు. ఇక సంక్రాంతి సంబరాల్లో మూడో రోజైన రేపు అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించనున్నారు. ఈ నెల 7వ తేదీన రొంపిచర్లలో చల్లా బాబు ఫ్లెక్సీలను చింపడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను టిడిపి క్యాడర్ అడ్డుకున్న క్రమంలో టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం ఏర్పడింది. ఈ ఘటనలో టిడిపి క్యాడర్ పై హత్యాయత్నం సెక్షన్ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు చేశారు. 8 మంది టీడీపీ కార్యకర్తలను 10 వ తేదీ అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఇక జైల్లో ఉన్న టిడిపి కార్యకర్తలను పీలేరు సబ్ జైలుకు వెళ్లి రేపు చంద్రబాబు పరామర్శించనున్నారు.