పవన్ కళ్యాణ్‌పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్‌పై డిప్యూటీ సీఎం సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీకి దత్తపుత్రుడన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికి తెగ తాపత్రేయ పడుతున్నారన్నారు. కాపు సామాజిక వర్గాన్ని పవన్ చంద్రబాబు కాళ్ల వద్ద పెట్టాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ప్రజలకు వ్యక్తిగత సహాయం చేశాడా అని ప్రశ్నించారు.
సినిమాలు చూసి ఆనందం పొందే అభిమానుల ముదు పంచ్ డైలాగులు వేయడం పవన్ రాజకీయం అనుకుంటున్నారన్నారు. 2019లో టీడీపీ ఓటమి పాలు అవుతుందని తెలిసినా.. పవన్ వైసీపీ ఓట్లు చీల్చి టీడీపీని గద్దెనెక్కించి లబ్ది పొందాలని చూశారన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్న సత్యనారాయణ.. జనసేన, బీజేపీతో పాటు టీడీపీ కలిసినా రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేరన్నారు.