Geetam Medical College : ఆంధ్రప్రదేశ్ లో గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత
Geetam Medical College: ఆంధ్రప్రదేశ్ లో గీతం మెడికల్ కాలేజీ కూల్చివేస్తున్నారుఅధికారులు. నిబంధనలకు పాటించకుండా నిర్మాణాలు చేపట్టారని కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. తెల్లవారు జామునుండి కూల్చి వేతలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రహరీ గోడలు తొలగిస్తున్నారు. ఈ సంఘటనపై గీతం యాజమాన్యం తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. పోలీసులు ఎందుకు వచ్చారో కూడా తమకు అర్ధం కావడం లేదని అంటోంది.
ఈ హైడ్రామా కొనసాగిన కాసేపటికి ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మాణాలు తొలగింపు చేపట్టారు. దీంతో విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ కట్టడాల తొలగింపునకు గతంలోనే ప్రభుత్వం యత్నించింది. అనుమతికి మించి ఈ కట్టడాలు నిర్మించారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకే కట్టడాలను కూల్చేస్తున్నట్టు అప్పట్లో పేర్కొంది. దీనిపై కోర్టుకు వెళ్లిన గీతం యాజమాన్యం స్టే తెచ్చుకుంది. గడువు ముగియడంతో ఇప్పుడు మరోసారి నిర్మాణాలు పడగొట్టేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. సుమారు 45 ఎకరాలు మేర ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.