Mandous Cyclone: తీరం దాటిన మాండూస్.. రెడ్ అలెర్ట్
Mandous Cyclone: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండూస్’గా నామకరణం చేశారు. ఇది తుపానుగా మారి వాయుగుండం తీరం దాటింది. మహాబలిపురం సమీపంలో తీరందాటిందని తెలుస్తోంది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రాయలసీమలోని చిత్తూరు, జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది.
భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఐదు ఎన్డీఆర్‌ఎప్, నాలుగు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. తమిళనాడులో ఆరు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. తుపాన్ కదలికలను స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేస్తున్నామని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.