అతి తీవ్ర తుఫాన్ గా మారిన అసనీ… అన్ని పోర్టుల్లో…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం అసనీ తుఫాన్ నికోబార్ కు 610 కిలోమీటర్ల దూరంలో, పోర్ట్ బ్లెయిర్‌కు 500 కిలోమీటర్లు, విశాఖ తీరానికి 670 కిలోమీటర్లు, పూరీకి 880 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 14 కిమీ వేగంతో వాయువ్య దిశగా ఈ తుఫాన్ కదులుతున్నది.
రేపు రాత్రికి లేదా తెల్లవారుజాము వరకు ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఇక ఓడ రేపుల్లో ఇప్పటికే రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుఫాన్ తీరం దాటే వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు. తీరం దాటే సమయంలో గంటకు100 నుంచి 125 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.