సిపిఐ నారాయణకు సతీవియోగం
సీపీఐ సీనియర్ నేత నారాయణ భార్య వసుమతి కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. వసుమతి మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు నగరికి సమీపంలోని అయినంబాకంలోని నారాయణ గారి స్వగ్రామం నందు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమెకు మూడు రోజుల క్రితం స్టంట్ వేశారని, ఇవాళ డిశ్చార్జ్ చేశారని అంటున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత గుండె నొప్పితో కుప్పకూలారని తెలుస్తోంది. ఆసుపత్రికి తీసుకు వెళ్ళే లోపు మృతి చెందారని తెలుస్తోంది.