Pattabhi Bail: టీడీపీ నేత పట్టాభికి బెయిల్.. కానీ?
Pattabhi Bail: టీడీపీ నేత పట్టాభికి స్పెషల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. పోలీసు కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసిన జడ్జి 25 వేల రూపాయల పూచీకత్తుతో ఇద్దరు జామీనులతో బెయిల్ ఇచ్చారు. అయితే మూడు నెలల పాటు ప్రతి గురువారం కోర్టుకు హాజరు కావాలని కండిషన్ పెట్టారు. ఈ క్రమంలో సాక్షులను ప్రభావితం చేయరాదన్న జడ్జి, విచారణకు సహకరించాలని కోరారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసు మీద దాడి సమయంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సహా 14 మంది టీడీపీ నేతలను గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. గన్నవరంలో పోలీస్ స్టేషన్ లో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి.. వ్యానులో తరలించి.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పట్టాభి.. టీడీపీ నేతలు తనను కులం పేరుతో దూషించారని.. ప్రాణహాని కలిగించేందుకు యత్నించారు అంటూ సీఐ కనకరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు… టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పట్టాభిని ఏ 1 గా… ఏ – 2గా చిన్న… సహా మరో 13 మందిపై కేసులు ఫైల్ చేశారు.