KVP letter to PM Modi: ప్రధాని మోడీకి కేవీపీ లేఖ, పోలవరం పూర్తికి సహకరించాలని విజ్ఞప్తి
Congress Senior leader KVP letter to PM Modi for Polavaram Project Completion
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు అనాధగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమను ప్రదర్శిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 300 టీఎంసీ జలాలు వృధాగా సముద్రంలో కలిసి పోతున్నాయని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కేవీపీ మండిపడ్డారు.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి సరిపడినంత నిధులను సమకూర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేపీవీ విమర్శలు గుప్పించారు. 2014 లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2018 వరకు పూర్తి చేయాల్సి ఉందని గుర్తుచేశారు.
దురదృష్టవశాత్తు ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించడమైనది. అలా ఎందుకు జరిగిందో, మీకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే పూర్తిగా తెలుసునని కేవీపీ గుర్తుచేశారు. పార్లమెంటు ఆమోదించిన చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారని కేవీపీ తప్పుబట్టారు. 2018 వరకు పూర్తిగా వచ్చిన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే ఐదేళ్లు జాప్యం అయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో జ్యోతిష్యులకు కూడా అంతుచిక్కడం లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత, రాజధాని హైదరాబాద్ ను కోల్పోవడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిధుల లేమితో సతమతమవుతున్న విషయం మీకు తెలిసిందేనని కేవీపీ ప్రధాని మోడీకి గుర్తుచేశారు. ప్రత్యేక హోదా హౌమీతో పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చునంత కేంద్ర ప్రభుత్వమే భరాయిస్తుందన్న విషయం చట్టంలో ఉందని కేవీపీ గుర్తుచేశారు.
జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ అంశం పట్ల పూర్తిస్థాయి దృష్టిని సారించి, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలాసంబంధిత కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కేవీపీ ప్రధానిని కోరారు. రాష్ట్ర ఖజానాపై భారం మోపకుండా, కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చి, 150 అడిగుల ఎత్తుతో కూడిన “పూర్తి రిజర్వాయర్ లెవెల్” ( ఎఫ్.ఆర్.ఎల్), “అత్యధిక నీటిని నిల్వ చేసుకునే ఎత్తు” ( ఎమ్.డబ్ల్యు.ఎల్) కూడిన ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని కేవీపీ ప్రధానిని విజ్ఞప్తి చేశారు.
#polavaram @TV9Telugu @NtvTeluguLive @NTVJustIn @abntelugutv @Telugu360 @Telugu_Titans @ZeeTVTelugu @bbcnewstelugu @hmtvnewslive @IndianExpress
@TOIHyderabad @Tv5teluguNews @etvandhraprades @greatandhranews @idhatri2
@PTI_News @airnewsalerts @sakshinews @Media_SAI pic.twitter.com/3K5sW9ggbI— Ramachandra Rao KVP (@DrKvpExMP) March 13, 2023