వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా( Social Media)యూజర్లు..టీడీపీ నేత నారా లోకేష్( Lokesh)పై ఏపీ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లల్లో ఆయనపై లిఖితపూర్వకంగా కంప్లైంట్లు(Complaints ) ఇచ్చారు.
YCP leaders : వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా( Social Media)యూజర్లు..టీడీపీ నేత నారా లోకేష్( Lokesh)పై ఏపీ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లల్లో ఆయనపై లిఖితపూర్వకంగా కంప్లైంట్లు(Complaints ) ఇచ్చారు. వారి ఫిర్యాదులతో చాలా చోట్ల నారా లోకేష్‌పై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.వైసీపీ నాయకులతో గొడవ పడండి.. మీ మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే మీకు పార్టీలో అంత ప్రాధాన్యం ఉంటుంది. అంత మంచి నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడంటూ నారా లోకేష్ చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకులు, విమర్శకుల్లో చర్చనీయాంశమైంది. ఇటు గన్నవరంలో సభలో కూడా నారా లోకేష్ అదే మీనింగ్‌లో ప్రసంగించారు. మనం అధికారంలోకి వచ్చాక ఒకొక్కడికి ఉచ్చ పోయిస్తాం… చెడ్డీలతో నడిపిద్దాం..’ అంటూ మాట్లాడారు. అయితే ఇలా నారా లోకేష్ వారిని మూర్ఖంగా మాట్లాడుతూ హింసను రెచ్చగొడుతున్నారని(Allegations of inciting violence) వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
జిల్లాల్లోని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు రెచ్చగొట్టినందునే తంబళ్లపల్లె, పుంగనూరు, మాచర్ల వంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని, ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారని.. దీనికి టీడీపీ నాయకత్వమే కారణమని స్పష్టం చేస్తున్నారు. సమాజంలో శాంతియుత జీవనానికి విఘాతం(inciting violence) కలిగించేలా లోకేష్( Lokesh) ప్రకటనలు ఉంటున్నాయని, దీంతో ఆయన మీద కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు వెళుతున్న సోషల్ మీడియా కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నారు.
మరోవైపు లోకేష్( Lokesh) చేస్తున్న ప్రసంగాల పట్ల వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media) భగ్గుమంటోంది. ఒక రాజకీయనాయకుడై ఉండి కార్యకర్తలను హింస వైపు నడిపిస్తారా..? అంటూ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరు బాధ్యులు అంటూ నిలదీస్తోంది. హింసను ప్రేరేపించే లోకేష్ మీద, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.