CockFights: కోట్లు దాటుతున్న..కోళ్లపందాలు
CockFights: సంక్రాంతి వచ్చిందటే చాలు ఆ సందడే వేరు..ఎవరెక్కడున్న ఎక్కడున్నా ఈ పండక్కి ఊరిబాట పట్టాలిసిందే. సంక్రాంతి అంటే అందరికి గుర్తుకొచ్చేది. భోగి మంటలు, ఇంట్లోని పాత వస్తువులు తెచ్చి ఆ భోగిమంటల్లో వేస్తె కొత్తజీవితానికి స్వాగతం చెపుతున్నాయని ఓ నానుడి. అలాగే సంక్రాంతి అంటే పిండి వంటలు, హరిదాసు కీర్తనలు,గంగిరెద్దు మేళంలు, జానపద కళారూపాలు, సంక్రాంతికి సొబగులు ఇవన్నీ కలబోసి పల్లెల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఇక పిల్లలో సంబరాలు ఒకలా ఉంటె పెద్దవాళ్ళ సంబరాలు వేరే అవే కోళ్ల పందాలు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. పోలీసు అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గ్రామాల శివార్లలోని తోటలు, ఖాళీ స్థలాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోళ్ల యజమానులతోపాటు బయట వ్యక్తులు కూడా పందేలు కాస్తున్నారు. ఏటా సాంప్రదాయంగా వస్తోన్న కోళ్ల పందేల కోసం ఒకవైపు పుంజులు కాళ్లు దువ్వుతుంటే.. మరోవైపు పందెం రాయుళ్లు బరులను సిద్ధం చేస్తున్నారు.
కాయ్ రాజా.. కాయ్ అంటూ జోరుగా పందాలకు సై అంటున్నారు. పౌరుషానికీ, రాజసానికీ పందెం కోళ్లను భావిస్తారు. కోడి పుంజు బరిలోకి దిగితే చాలు అది చనిపోయే వరకు ప్రత్యర్థితో పోరాడుతూ ఉంటుంది. సంక్రాంతికి ఆరు నెలల ముందు నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తూ.. పోషకాహారం పెడుతూ పెంచుతారు. నెలకు మినిమమ్ 20 వేల వరకు ఖర్చుపెడుతుంటారు. కోళ్ళనిర్వాహకులు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా మేము సైతం అంటూ.. పందేల్లో పాల్గొంటున్నారు. పండుగ నాలుగు రోజుల ముందు ఈ పందాలకు నిర్వాహకులు సిద్ధం చేసారు.
సంక్రాంతికి కోడి పందేలు లేని గోదావరి జిల్లాలను ఊహించుకోవడం కష్టం కోర్టుల తీర్పులు, పోలీసుల చర్యలు ఎలా ఉన్నా.. పందేలు మాత్రం ఆగవు. వివిధ జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. 5 వేల నుంచి కోట్లవరకు ఈ పందాలు కొనసాగుతాయి. తాజాగా ఈ పందాలకు వచ్చిన వాళ్లకు స్వైప్ మిషన్స్ కూడా తెప్పించారు. ఒకవేళ డబ్బులు అయిపోతే కమిషన్స్ మీద డబ్బులు ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేసారు.