Kcr And Jagan: విశాఖ కి తెలుగు రాష్ట్రాల సీఎంలు
Kcr And Jagan: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. విశాఖలోని శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కు హాజరు కావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్ లకు ఆహ్వానం అందించారు. దీంతో ఈ నెల 28న జగన్ శారదాపీఠంకి వెళ్లనున్నారు. అక్కడ జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొనబోతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఈ రాజశ్యామల యాగం చేసారు. ఆ తర్వాత అధికారంలోకి రావడంతో.. పలుమార్లు శారదాపీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నారు.తాజాగా మరోమారు స్వామి ఆశీస్సులుతీసుకోనున్నారు.
మరో వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కార్య క్రమానికి వస్తారనే దానికి ఖచ్చితమైన స్పష్టత రావాల్సి ఉంది. తప్పకుండా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని.. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని ఏపీ బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే ఒకే రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు విశాఖకి రానున్నారని సమాచారం. ఇక ఇద్దరి ముఖ్యమంత్రుల భద్రత కోసం ఇప్పటికే శారదాపీఠంలో ఆణువణువూ ను పరిశీలిస్తున్నారు. శారదాపీఠంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత సీఎం కేసీఆర్ ఏపీ బీఆర్ఎస్ నేతల తో సమావేశం కానున్నారని తెలుస్తుంది.