GIS 2023: పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా నిలుస్తోంది – సీఎం జగన్
CM Speech at Veledictory session of AP GIS 2023
జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందని సీఎం జగన్ అన్నారు. భాగస్వామ్య సదస్సులో సీఎం జగన్ ముగింపు ప్రసంగం చేశారు. భాగస్వామ్య సదస్సును సక్సెస్ చేశారని సదస్సు ఫలవంతం అయిందని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలిచిందని, తాజాగా వస్తున్న పెట్టుబడులతో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు. కోవిడ్ కష్టాలను అధిమగించి అన్నింటా ముందు నిలిచామని సీఎం జగన్ గుర్తుచేశారు.
ఈ రంగాలలో పెట్టుబడుల ప్రవాహం
కేంద్ర మంత్రులు, గ్లోబల్ పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులతో చర్చలు చేసామని, ఆంధ్రప్రదేశ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తుందని సీఎం అన్నారు.జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందని, ఏపీ అభివృద్ధికి 15 సెక్టార్లు కీలకమైనవిగా గుర్తించామని సీఎం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, పరిశ్రమల రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం గుర్తుచేశారు. ఎంఓయూ స్థాయి నుంచి పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేయాలని అభ్యర్ధించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, చీఫ్ సెక్రటరీ సీఎంఓ స్థాయిలో ఈ ఎంఓయూలు గ్రౌండ్ చేసేందుకు ప్రతీ వారం సమావేశం కావాలని సూచించారు.