CM Jagan: రేపు విశాఖకు సీఎం జగన్
CM Gajan visit to Visakhapatnam: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించనున్న వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ ఏడాది నిధులను జగన్ జమ చేయనున్నారు. సొంత వాహనాలు కలిగిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 10వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్న జగన్.. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. ఈ కార్యక్రమం అనంతరం జగన్ మధ్యాహ్న సమయంలో తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
ఈ నెల 13నే సీఎం విశాఖలో పర్యటించనుండగా.. వర్షాల వల్ల తన పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నారు. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. ధవళేశ్వరం వద్ద వదర ప్రవాహం అధికంగా ఉంది. బాధితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యమంత్రి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లుతో ఎప్పటి కప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్విహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.