ఎల్లుండి నెల్లూరుకు సీఎం జగన్
ఈ నెల 28న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటించనున్నారు. దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఎల్లుండి ఉదయం 10 గంటల15 నిమిషాలకు సీఎం తాడేపల్లి నుంచి గన్నవరం ఏయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలు దేరి ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సీఎం నెల్లూరు జిల్లాకు చేరుకొనున్నారు.
నెల్లూరులోని గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు జగన్ తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్లనున్నారు.