CM YS Jagan: సీఎం జగన్ విచారణకు హాజరుకావాలి..ఎన్‌ఐఏ కోర్టు
CM YS Jagan: గత ఎన్నికల సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరగడం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్‌మోహన్‌రెడ్డికి ఎన్ఐఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా వచ్చే నెల 10న విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆంజనేయమూర్తి ఆదేశాలనిచ్చారు.
ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ కమాండర్ దినేష్‌ను ఎన్ఐఏ విచారించింది. ఈ కేసుకు సంబంధించి కోడి కత్తి, మరో చిన్న కత్తి, పర్సు, సెల్‌ఫోన్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏప్రిల్ 10న విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించింది. సీఎంతో పాటు ఆయన పీఏ కె.నాగేశ్వర్‌రెడ్డి కూడా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.