Vidya Deevena: ప్రభుత్వ బడులతో కార్పోరేట్ స్కూల్స్ పోటీ పడే రోజులు వస్తాయి – సీఎం జగన్
CM Jagan released funds for Vidya Deevena Scheme
జగనన్న విద్యా దీవెన పథకం కింద 2022-23లో డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.698 కోట్లు జమ చేశారు. దీంతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద విద్యార్ధులకు రూ.13,311 కోట్లు సాయం అందించినట్లు సీఎం తెలిపారు.
విద్యాదీవెన అందుకే..
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని, పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యమని సీఎం జగన్ అన్నారు. చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశ్యంతోనే విద్యాదీవెన ప్రవేశపెట్టామని చెప్పారు. కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత తనదేనని, చంద్రబాబు హయంలోని బకాయిలను కూడా తాము చెల్లిస్తున్నామని సీఎం జగన్ గుర్తుచేశారు. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా 698.68 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లలోకి జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలతో కార్పోరేట్లు స్కూల్స్ పోటే పడే రోజులు వస్తాయని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు.
దుష్ట చతుష్టయంతో యుద్ధం
రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు మానవతా విలువలు లేని దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. తమ ప్రభుత్వంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ఉంటే…గత ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో అనే విధానం కొనసాగించదని జగన్ విమర్శలు గుప్పించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం. హాజరైన ముఖ్యమంత్రి. pic.twitter.com/hA1xLdvLuv
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 19, 2023
తిరువూరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం సభ. డ్రోన్ దృశ్యాలు. pic.twitter.com/TBsyDaDmpp
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 19, 2023
తిరువూరులో సీఎం పాల్గొన్న సభాప్రాంగణం కిక్కిరిసిపోవడంతో బయట ఉన్న ప్రజలు.#YSJagan #YSJaganMarkGovernance #AndhraPradesh pic.twitter.com/uDjh0f6H6B
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 19, 2023