హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం జగన్ భేటీ
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ అయ్యారు. సీఎం జగన్ సీజేతో భేటీ కావడం ఇదే మొదటి సారి. ఈ సమావేశం స్టేట్ గెస్ట్ హౌస్‌లో జరుగుతుంది. మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చ జరిగిన నేపథ్యంలో ఇరువురి భేటీ ఆసక్తికరంగా మారింది. గతంలో జస్టిస్ పీకే మిశ్రా సీఎం జగన్ పలుమార్లు పబ్లిక్ మీటింగ్‌లో కలిశారు. కానీ సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ కావడం ఇదే మొదటి సారి.
మరోవైపు సీఎం జగన్ ఈ నెల 30న ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ జరిగే జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ప్రధాని అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ప్రధాని పలు సూచనలు చేయనున్నారు.