AP: సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు
CM Jagan in Sankranti Celebrations at Tadepalli Camp office
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం జగన్ దంపతులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా జరిగిన సంబరాల్లో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.
గోషాల వద్దకు చేరుకున్న సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వైభవంగా వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నానని సీఎం జగన్ తెలిపారు.
తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ జానపద గాయని కనకవ్వ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. తన గాత్ర మాధుర్యంతో అందరినీ అలరించారు. తాను ఇటీవలే డెంగ్యూ బారిన పడ్డానని, సీఎం జగన్ పిలిచారని తెలియడంతో ఇక్కడ ప్రదర్శనకు వచ్చానని తెలిపారు. అనంతరం సీఎం దంపతులు కూర్చున్ స్టేజ్ వద్దకు వచ్చి వారిని కనకవ్వ కలిసింది.
తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా సంక్రాంతి సంబరాలు.
సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలతో వైభవంగా వేడుకలు. pic.twitter.com/rZmr2gX9AB— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 14, 2023