చంద్రబాబు పై మరో సారి మండిపడ్డారు ఏపీ సీఎం జగన్ .
AP CM JAGAN : చంద్రబాబు (Chandra Babu)పై మరో సారి మండిపడ్డారు ఏపీ (AP) సీఎం (CM) జగన్ (Jagan). విజయవాడ (Vijayawada)లో ఆయన వాలంటీర్ల(Valanteers)కు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి (Government)ప్రజల (people)కు మధ్య వారధులు, సంక్షేమానికి సారథులు వాలంటీర్లని జగన్ అభిప్రాయపడ్డారు. 2019లో అధికారంలోకి రాగానే నవరత్నాల ఫిలాసఫీ, ప్రభుత్వం నచ్చి స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వచ్చిన సైన్యమే (Army) 2లక్షల 66 వేల మంది వాలంటీర్లే అన్నారు.
దేశంలో ఎక్కడా లేదు…
దేశంలో ఎక్కడ చూసినా గతంలో చూడని విధంగా రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకానికి సంక్షేమ సారథులు, వారధులు వాలంటీర్లేనన్నారు. అభివృద్ధికోసం జరుగుతున్న మార్పులకు సాక్ష్యాలు కూడా వాలంటీర్లేనన్నారు. దాదాపు 90 శాతం గడపలకు వెళ్లి సంక్షేమాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న వ్యవస్థ కూడా ఇదే అని జగన్ ప్రశంసించారు. గతంలో జన్మభూమి అరాచకాలు చూశారని… అలాంటి అరచకాలు లేకుండా వాటి స్థానంలో తీసుకొచ్చిన తులసి మొక్కలాంటి వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నారు. దీని పని తీరును వివరించే నైతికత కూడా వాటంటీర్లకే ఉందన్నారు.
బ్రాండ్ అంబాసిడర్లు
ప్రతి ఒక్కరికీ నిజాలు చెప్పే బాధ్యత వాలంటీర్లకే ఉందన్నారు జగన్. అమలు చేస్తున్న పథకాన్ని తీసుకున్నా వాలంటర్ల చేతుల మీదుగానే ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. 25 రకాల పథకాలకు బ్రాండ్ అంబాజిడర్లుగా ప్రతి ఇంటికి వెళ్తున్నారన్నారు. 3 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి చేర్చిన ఘనత వాలంటీర్లదేనన్నారు.
బాబుకు ఓర్వలేని తనం
చంద్రబాబు ఇవన్నీ చూసి ఓర్వలేకపోతున్నారని జగన్మండి పడ్డారు. పని గట్టుకొని ఎలా దుష్ప్రాచారం చేస్తున్నారో చూస్తున్నామని అన్నారు. ఇలాంటి అన్యాయమైన రాజకీయాల మధ్య నిల్చొని ఉన్నామని తెలిపారు. పేదల ప్రభుత్వంపై గిట్టని వారు తప్పుడు ప్రచారం చేస్తూ… నిందలు వేస్తే 5 కోట్ల ప్రజల ప్రతి గడపకు వెళ్లి నిజాలు చెప్పే సారథులు వాలంటీర్లేనన్నారు. ఈ ప్రభుత్వ ఫిలాసిపీకి ప్రతిరూపం మీరేనన్నారు. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తున్నది సేవ మాత్రమేనన్నారు. ఇది ప్రభుత్వం ఉద్యోగం కాదన్న జగన్… అందుకే వాలంటీర్ అని పేరు పెట్టామన్నారు. ఎవరైనా మిమ్మల్ని ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అని అంటే మాత్రం గట్టిగా సమాధానం చెప్పాలన్నారు.
కడుపుమంట
వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి చంద్రబాబు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ అంటేనే చంద్రబాబుకు కడుపు మంట అని అన్నారు. డజనుర జెలసిల్ మాత్రలు వేసినా తగ్గదని ఎద్దేవా చేశారు. అందుకే వాలంటీర్లు వ్యవస్థ రద్దు చేసి జన్మభూమి కమిటీలు పెడతామని కూడా అన్నారన్నారు. కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మంచి చేసే ప్రభుత్వానికి, మంచి చేసే సీఎంకు కచ్చితంగా వాలంటీర్లు బ్రాండ్ అంబాజిడర్లు అని చెప్పారు.