AP: బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మంగళవారం మత్స్యకార భరోసా ఐదో విడత నిధులను సీఎం జగన్ (Cm Jagan) విడుదల చేశారు. అర్హులైన ఒక్కొక్క మత్స్యకారుడి ఖాతాలో రూ. 10 వేల చొప్పున జమ చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి మొత్తం 1,23,519 మత్స్యకారుల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు.
AP: బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మంగళవారం మత్స్యకార భరోసా ఐదో విడత నిధులను సీఎం జగన్ (Cm Jagan) విడుదల చేశారు. అర్హులైన ఒక్కొక్క మత్స్యకారుడి ఖాతాలో రూ. 10 వేల చొప్పున జమ చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి మొత్తం 1,23,519 మత్స్యకారుల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan kalyan)లపై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీం కూడా గుర్తుకు రాదని.. వెన్నుపోటు మాత్రమే గుర్తొస్తుందని విమర్శించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పేదలు, ప్రజలు గుర్తుకొస్తారని అన్నారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పొత్తులు, ఎత్తులు, కుట్రలను నమ్ముకున్నారని ధ్వజమొత్తారు. చంద్రబాబు పొలిటికల్ స్క్రిప్ట్ ప్రకారం ప్యాకేజీ స్టార్ నడుస్తున్నాడని ఎద్దేవా చేశారు.
తన పార్టీని హోల్ సేల్‌గా ప్యాకేజీస్టార్ అమ్ముకున్నారని జగన్ ఆరోపించారు. సినిమాల మధ్య గ్యాప్ దొరికినప్పుడు పొలిటికల్ మీటింగ్ పెడుతారని చెప్పుకొచ్చారు. ప్యాకేజీ కోసం దత్తపుత్రుడు ఎటువంటి వేషాలైనా వేస్తారని విమర్శించారు. కలిసి పోటీచేద్దామని చంద్రబాబు అనగానే.. చిత్తం ప్రభు అంటూ దత్తపుత్రుడు దాసోహం అంటారని ఎద్దేవా చేశారు. వారికి రాష్ట్రంలో ఉండాలనే ఆలోచనే లేదని.. వారది రాజకీయ ఆరాటం అని అన్నారు. అధికారంలో ఉంటే అమరావతిలో లేదంటే హైదరాబాద్‌కు చెక్కేస్తారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకున్నారని.. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ఇళ్లు కట్టుకున్నానని జగన్ చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని జగన్ చెప్పుకొచ్చారు. మత్స్యకారులను ఆదుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు ముష్టి వేసినట్లు కేవలం రూ. 4 వేలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. తమ ప్రభుత్వం రూ. 10 వేలు అందజేస్తుందని చెప్పుకొచ్చారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక చంద్రబాబు.. దత్తపుత్రుడితో పొత్తులు పెట్టుకుంటున్నారని జగన్ విమర్శించారు.