CM Jagan: DPT కావాలా? DBT కావాలా, మీరే నిర్ణయించుకోండి
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (D.B.T)పై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం ద్వారా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధుల్ని.. లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కాకినాడ గొల్లప్రోలు సభ నుంచి లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు చేస్తున్నామని సీఎం జగన్ గుర్తుచేశారు. 3 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమచేయడం దేవుడు తనకిచ్చిన అవకాశంగా భావిస్తున్నాని సీఎం జగన్ అన్నారు. కాపులతో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు.
కాపులు ఓట్లు మూట కట్టి చంద్రబాబుకి అమ్మేయడానికి దత్తపుత్రుడు ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయాలు దిగ జరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హుద్‌హుద్ వచ్చినప్పుడు కుటుంబానికి 4 వేలు ఇచ్చామని చంద్ర బాబు అబద్దాలు చెప్తున్నాడని సీఎం జగన్ మండిపడ్డారు.తుపాన్ వచ్చిందంటే ఎక్కడికక్కడడే సహాయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు తుపాన్ సాయం అందలేని వారిని ఒక్కరిని కూడా చంద్రబాబు చూపించలేక పోయారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు హయాంలో డీ.పీ.టీ పథకం అమలయిందని ఎద్దేవా చేశారు. DPT అంటే దోచుకో, పంచుకో తినుకో అనే రీతిలో పాలన సాగిందని గుర్తుచేశారు. చంద్ర బాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు కలిసి రాష్ట్రాన్ని దోచుకుని పంచుకుని తిన్నారని ప్రజలకు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఎక్కువ చేస్తోందని, మరో శ్రీలంక కానుందని చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని సీఎం జగన్ తిప్పికొట్టారు. చంద్రబాబు. దుష్ట చతుష్టయం ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఉన్న డీ.పీ,టీ పథకం కావాలా? మన పాలనలో ఉన్న DBT పథకం కావాలా ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. నిజాయతీతో కూడిన రాజకీయాలు కావాలా? చంద్ర బాబు చేసే వెన్నుపోటు రాజకీయాలు కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు.