Margadarsi: మార్గదర్శి పై సీఐడీ రైడ్స్
Margadarsi: హైదరాబాద్ లోని మార్గదర్శి కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రైడ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మార్గదర్శిపై మళ్లీ దాడులు చేస్తుంది. ఇప్పుడు సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లల్లో తనిఖీలు జరుపుతున్నారు. విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్ ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.
కొద్ది రోజులు ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష్ల శాఖ అధికారులు ఏపీలోని పలు ఛిట్ ఫండ్ సంస్థల్లో సోదాలు చేసారు. మార్గదర్శి సంస్థల్లో చేసిన తనిఖీల్లో అక్రమాలు బయటకు వచ్చాయని అధికారులు వెల్లడించారు. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి డబ్బును దారి మళ్లిస్తున్నట్టు తేల్చారు. ఆ డబ్బును వడ్డీలకు ఇవ్వడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం వంటి వాటికి పాల్పడినట్టు నిర్దారించారు. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. మార్గదర్శి సంస్థ ఇదంతా కుట్రగా పేర్కొంటోంది.