Margadarsi : మార్గదర్శి పై సీఐడీ కేసు ఏ1గా రామోజీరావు
Margadarsi: రాష్ట్రంలోని మార్గదర్శి కార్యాలయాల్లో సోదాల అనంతరం పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు గుర్తించింది సీఐడీ. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ నిధుల మళ్లింపు వ్యవహారమై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ తనిఖీలు నిర్వహించింది. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము మళ్లించడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలతో సీఐడీ ఈ సోదాలు నిర్వహించింది. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని పేర్కొంటూ చిట్ ఫండ్స్ చైర్మన్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఆయన కోడలు, శైలజలపై సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజ, ఏ3గా బి. శ్రీనివాసరావు పేర్లను చేర్చారు.
1982 చిట్‌ఫండ్ చట్టం ప్రకారం సెక్షన్ 120బి, 409,420,477(a)రెడ్ విత్ 34 ఐపీసీతో పాటు..సెక్షన్ 5, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద సీఐడీ రామోజీరావు తదితరులపై కేసు నమోదు చేసింది. సంస్థ మేనేజర్లపైనా కేసు నమోదు చేసింది. విజయవాడలోని లబ్బీపేట కార్యాలయానికి మేనేజర్‌ను ఇంటి నుంచి తీసుకొచ్చిన అధికారులు బలవంతంగా కార్యాలయ తలుపులు తెరిపించారని సిబ్బంది పేర్కొన్నారు. శనివారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటలకు వరకూ తనిఖీలు చేశారు. నేడు కూడా సోదాలు కొనసాగుతాయని అదనపు ఎస్పీ తెలిపారు