Nimmakayala Chinarajappa: టీడీపీ, జనసేన కలిస్తే వైసిపి ఇక ఇంటికే..చినరాజప్ప
Nimmakayala Chinarajappa: రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు , పవన్‌కల్యాణ్ కలిసి పోలీ చేస్తే వైసిపి ఓడిపోవడం ఖాయమని చేసిన వ్యాఖ్యలపై మాజీ హౌంమంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలిస్తే మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన లో భాగంగా విశాఖలో ఇబ్బందులకు గురి చేశారు. ఆ రోజు చంద్రబాబు.. పవన్‌ను పలకరించాలని వెళ్లారు. ఇప్పుడు కుప్పంలో ఆంక్షలు పెట్టి చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై చంద్రబాబును పలకరించడానికి పవన్ వెళ్తే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని ఆగ్రహము వ్యక్తం చేసాడు.
టీడీపీ – జనసేన కలిస్తే మీకు వచ్చే ఎన్నికల్లో అడ్రస్ ఉండదనే భయంతోనే నోటికొచ్చినట్లు మంత్రులు, వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు అ నూహ్యంగా పెరిగిపోయాయని, ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేసారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని రైతులు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. సంక్రాంతి కానుకలు పంపిణీ నిలిపివేయడంతో పేదలకు పండుగ భారంగా మారాయన్నారు. వైసీపీ ని ఇంటికి సాగనంపే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.