చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) భద్రత తమ ప్రభుత్వానిదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa satyanarayana) స్పష్టం చేశారు. చంద్రబాబు భద్రత విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా తమని ప్రశ్నించొచ్చని అన్నారు.
Botsa Satyanarayana :స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) భద్రత తమ ప్రభుత్వానిదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa satyanarayana) స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన బొత్స.. చంద్రబాబు భద్రత విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా తమని ప్రశ్నించొచ్చని అన్నారు.
ఒకవేళ భద్రత విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే మాత్రం.. కేంద్ర ప్రభుత్వానికి కూడా కాదు ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయాలని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అరెస్టు రాత్రికి రాత్రే జరగలేదని చెప్పిన బొత్స.. ఎన్నో దర్యాఫ్తు సంస్థలు దర్యాప్తు చేసిన తరువాతే..స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగినట్టు తేలిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన.. మహిళా రిజర్వేషన్ బిల్లును తాము కూడా స్వాగతిస్తున్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా జగన్ ప్రభుత్వం.. స్ధానిక సంస్ధల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించి.. మహిళా రిజర్వేషన్ను ఇప్పటికే అమలు చేస్తోందని మంత్రి బొత్స గుర్తు చేశారు.