Chandrababu: జనసేన కోసం బాబు త్యాగం తప్పదా?
Chandrababu: 2019 ఎన్నికల్లో అధికారానికి దూరమైన తెలుగుదేశం పార్టీ చాలా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు సైతం జగన్ ధాటికి తట్టుకోలేక ఆయనకు మద్దతుగా పలికి ఆయన పంచన చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో 2024 ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఖచ్చితంగా ఈసారి కూడా ఒంటరిగా వెళితే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయనే విషయం ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుకి ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే జనసేన బిజెపితో పాటు వామపక్షపక్షాలన్నింటిని కూడగట్టి వైసీపీని ఎదుర్కోవాలని ఆ తర్వాత ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.
విపక్ష పార్టీలు అన్నీ కలిసి పోటీ చేస్తేనే వైసీపీని ఓడించడం సాధ్యమవుతుందనే విషయం చంద్రబాబు ఇప్పటికే బలంగా నమ్ముతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు జనసేనతో టచ్ లో ఉంటూ ఆ పార్టీతో పొత్తు కుదురుచేందుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఎన్నికల సమయం నాటికి బీజేపీని కూడా ఒప్పించి జగన్ను పక్కన పెట్టి తాను ముఖ్యమంత్రి అవ్వాలని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు జనసేన సైలెంట్ గా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం జనసేన కూడా సీట్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు 20- 30 సీట్ల వరకు జనసేనకు కేటాయించి ఏపీలో అధికారంలోకి వద్దామని భావిస్తుంటే జనసేన మాత్రం ఆయన చెబుతున్న ప్రతిపాదనలకు ఒప్పుకోవడం లేదని నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ద్వారా అర్థమైంది.
అదేమిటంటే జనసేన కనీసం సగం సీట్లలో అయినా పోటీ చేయాలని అలాగే రెండున్నర సంవత్సరాలు, ముఖ్యమంత్రి పదవిని సైతం డిమాండ్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన మాటల ద్వారా క్లారిటీ వచ్చేసింది. అందుకే ఆయన మాటల్లో తేడా కనిపిస్తోందని అంటున్నారు. ఈ మేరకు కాపు సంక్షేమ శాఖ డిమాండ్ చేస్తే పవన్ కూడా అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తాం తప్ప ఎన్నో కొన్ని సీట్లతో సరిపెట్టుకోవాలి ఆని అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. అలాగే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కూడా ఇదే సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి జనసేన బేషరతుగా మద్దతిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారని అది కరెక్ట్ కాదని అన్నారు అంతేకాక జనసేనలో చేరాల్సిన నాయకులను సైతం టీడీపీ చేర్చుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఓడించాలంటే పవన్ ను సీఎం చేయాలి అనేది ఒక్కటే దారి అని అంతేకానీ జగన్ అధికారం దూరం చేయాలంటే చంద్రబాబును సీఎం చేయాలనడం కరెక్ట్ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ ను సీఎం చేస్తానని చెబితేనే జగన్ ను ఓడించడం కోసం పవన్ కలుస్తానని చెబితే ఏమి చేయాలా? అని టిడిపి ఆలోచిస్తోంది. టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు గతంలో లానే వస్తాయి కాబట్టి జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిందే అందుకే ఈసారి జగన్ కు అధికారం కట్టబెట్టడానికి ఏ మాత్రం సిద్ధంగా లేని చంద్రబాబు కాస్త వెనక్కి తగ్గయినా జనసేనకు గౌరవప్రదమైన స్థానాలకు కేటాయించి సీఎం సీటు విషయంలో త్యాగానికి సిద్ధమైతే తప్ప ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఏర్పడే అవకాశాలు లేవు. అలా ఏర్పడకపోతే జగన్ కట్టడం చేసే అవకాశాలు కనిపించడం లేదు.