Chandrababu: జూ.ఎన్టీఆర్ తో భేటీ కానున్న బాబు.. ఆరోజే ముహూర్తం?
Chandrababu to Meet Jr NTR Soon: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీతో తారక్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కూడా అందుకున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కు రాజకీయాలంటే ఆసక్తి ఉండడంతో 2009 సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్టీఆర్ ఎంతో కష్టపడినా అప్పటికే ప్రజల్లో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉండటంతో 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను అనేక కారణాలతో దూరం పెట్టారు. అయితే ఈమధ్య ఆయన అమిత్ షాతో భేటీ కావడం పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక ఈ క్రమంలో బీజేపీకి దగ్గరవుతారని చర్చ జరుగుతోంది .
అయితే ఈ క్రమంలోనే టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సేవలను వాడుకోవాలని మంతనాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ అమెరికా పర్యటనలో ఉండగా కొంతమంది ఎన్నారైలు ఆయనను బాబుతో భేటీ అయ్యేందుకు ఒప్పించినట్టు చెబుతున్నారు . ఎన్టీఆర్ అమెరిక నుంచి రాగానే బాబుతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో 2024 ఏపీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ చక్రం తిప్పే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ మనస్సు మార్చే ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది చూడాల్సి ఉంది.