Chandrababu: రోడ్డు మీదే భైఠాయించిన బాబు.. జగన్ ఇక్కడికే రావాలంటూ!
Chandrababu Sits on Road at Gudipalle in Kuppam: చిత్తూరు జిల్లా గుడిపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుడిపల్లిలో రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన కుప్పం పర్యటనలో భాగంగా నేడు టీడీపీ అధినేత చంద్రబాబు గుడిపల్లికి వెళ్లారు. అక్కడ పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబ రోడ్డుపై బైఠాయించారు. నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వడం లేదని పేర్కొన్న చంద్రబాబు, అసలు సైకోకు ఈ అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. నేను ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలో చెప్పాలని, కావాలనే నన్ను గుడుపల్లికి రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. సైకో జగన్ గుడుపల్లికి రా, ఏమిటి ఈ అరాచకం? అంటూ ఆయన ప్రశ్నించారు.
నేను తలచుకొని ఉంటే, నాడు నువ్వు పులివెందులకు పాదయాత్ర చేసే వాడివా? అని బాబు ప్రశ్నించారు. నన్ను వెనక్కు పంపలేరన్న బాబు, నాది ఐదు కోట్ల ప్రజల గొంతుక అని అన్నారు. పోలీసులు కూడా మారాలని పేర్కొన్న బాబు జీవో వచ్చిన తర్వాత కూడా సీఎం, మంత్రులు రోడ్ షో లు చేశారని గుర్తు చేశారు. వారికొక రూలు.. నాకో రూలా? నన్ను పంపాలని చూస్తే మిమ్మల్నే పంపిస్తా. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు’’ అని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు మీ ముఖాన ఉమ్ము వేస్తారని హెచ్చరించిన ఆయన సైకో పోవాలి…సైకిల్ రావాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుమీదనే చంద్రబాబు భైఠాయించారు.