Chandrababu: ప్రజలకు ధన్యవాదాలు..నాయకులకు సెల్యూట్!
Chandrababu: ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ… పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలోనూ పాగా వేసింది. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డి పై 7543 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్ల.లెక్కింపు తరువాత రాంగోపాల్ రెడ్డి 1,09,781 ఓట్లు, వెన్నపూస రవికి 1,02,238 ఓట్లు దక్కాయి. అయితే, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తున్న క్రమంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కింద కూర్చుని నిరసన తెలిపారు. ఇక ఈ క్రమంలో చంద్రబాబు ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు, గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు అని పేర్కొన్న ఆయన. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ అన్నారు. ఇది ప్రజా విజయం. మార్పుకు సంకేతం. మంచికి మార్గం. రాష్ట్రానికి శుభసూచకమని బాబు పేర్కొన్నారు.