మాజీ సీఎం, స్వర్గీయ ఎన్టీఆర్(NTR) పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి(Coin Release Program) తనను ఆహ్వానించకపోవడంతో.. నందమూరి లక్ష్మీపార్వతి(Lakshmi Parvati) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lakshmi Parvati : మాజీ సీఎం, స్వర్గీయ ఎన్టీఆర్(NTR) పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి(Coin Release Program) తనను ఆహ్వానించకపోవడంతో.. నందమూరి లక్ష్మీపార్వతి(Lakshmi Parvati) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్లే ఇప్పుడు వారసులుగా చెలామణి అవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ పేరుతో(In the name of NTR) రూ.100 నాణెం విడుదల చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆమె.. ఆ వేడుకకు తనను ఆహ్వానించకపోవడం మాత్రం బాధగా ఉందన్నారు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తే ఎన్టీఆర్ భార్య(NTR’s wife)గా తనను ఆహ్వానించకపోవడం ఏంటన్నారు.ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులే వారసులుగా చెలామణి అయ్యి.. తాళి కట్టించుకున్న భార్యనైన తనను అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు.
ఎన్టీఆర్ కొడుకులు అమాయకులేనని.. కానీ కూతుళ్లు పురంధేశ్వరి(Purandeshwari,), భువనేశ్వరి( Bhubaneswari) మాత్రం దుర్మార్గులంటూ లక్ష్మీ పార్వతి(Lakshmi Parvati) విమర్శించారు. రాబోయే రోజుల్లో తన పోరాటం దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeshwari,)పైనే ఉంటుందని ఆమె.. చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి కుట్రలు చేస్తోందన్నారు.
ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంపై ఉన్న అభిమానంతోనే మౌనం వహించానని..చంద్రబాబు(Chandrababu), పురంధేశ్వరి(Purandeshwari,), బాలకృష్ణ(Balakrishna) అందరినీ బయటికి లాగుతానని హెచ్చరించారు. నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై..ఢిల్లీలో తేల్చుకుంటానని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుస్తానని లక్ష్మీపార్వతి చెప్పారు.