Ys Sunitha: వివేకా హత్య కేసులో నిజం బయటకు రావాలి..కుమార్తె సునీత
Ys Sunitha: వివేకానందరెడ్డి 4వ వర్థంతి స్మరించుకుని ఆయన కుమార్తె వైఎస్ సునీత నివాళ్లర్పించారు. పులివెందులలోని వివేకా సమాధి వద్ద వివేకా సతీమణి, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి నివాళులు అర్పించారు. కేసు విచారణ దశలో తాను మాట్లాడబోనన్నారు సునీత. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ప్రభావితం చేయకూడదని.. పోలీసుల మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ల పని వాళ్లని చేయనీయాలన్నారు. న్యాయం గెలవాలని, దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకుడదన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి వర్థంతిని గుర్తు చేస్తూ జస్టిస్ ఫర్ వివేకా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ అధికారం లోకి వచ్చిన నాలుగేళ్లలో.. రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేక పోయారు.. చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించలేకపోయారని అన్నారు. జగనాసుర రక్త చరిత్రే అని రాష్ట్రం లో ప్రతి ఇంటా తెలుసు.. అది ఆ ఇంట జరిగిన కుట్రే. తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి.. బాబాయ్ హత్యతో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి.. ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా..అని చంద్రబాబు ట్వీట్ చేసాడు.
వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రం లో ప్రతి ఇంటా తెలుసు…అది ఆ ఇంట జరిగిన కుట్రే.(2/3)#JusticeForYSViveka
— N Chandrababu Naidu (@ncbn) March 15, 2023
తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి… బాబాయ్ హత్య తో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి….ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా?(3/3)#JusticeForYSViveka
— N Chandrababu Naidu (@ncbn) March 15, 2023