CBN New Strategy: ఎన్నికల కోసం చంద్రబాబు సరికొత్త వ్యూహం… జనసేనకు కేటాయిస్తారా?
CBN New Strategy: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు సంబంధించి సరికోత్త వ్యూహాలను రచిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడానికి అవసరమైన నియోజకవర్గాలను ఎంపిక చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన కూడా పోటీ చేయడం వలన తెలుగుదేశం పార్టీ 53 స్థానాలను కోల్పోవలసి వచ్చింది. జనసేన పోటీ నుండి తప్పుకున్నా లేదంటే, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసినా రెండోసారి కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చేవారు. జనసేన కారణంగా తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైన 53 నియోజకవర్గాలపై చంద్రబాబు నాయుడు సర్వేలను చేయించారు.
ఈ సర్వేలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండటంతో ఈ నియోజకవర్గాలపై బాబు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు దాదాపుగా ఖరారు కావడంతో ఆ పార్టీకి కూడా తగినన్ని స్థానాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పైగా పవన్ కళ్యాణ్ గౌరవపదమైన పొత్తు అని చెప్పడం వెనుక పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు అర్ధం అవుతున్నది. గతంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన 23 స్థానాల్లో తిరిగి విజయం సాధించగలమని ధీమాను వ్యక్తం చేస్తున్నది. అదేవిధంగా, 53 స్థానాల్లో గట్టిగా కష్టపడితే మొత్తం కలుపుకొని 76 స్థానాలు అవుతాయి. జనసేన సాధించిన ఒక స్థానం కూడా కలుపుకుంటే 77 అవుతాయి. అధికారంలోకి రావాలంటే 88 మెజారిటీ 88 ఉండాలి. మరో 11 స్థానాల్లో విజయం సాధిస్తే సరిపోతుందని బాబు ఆలోచన.
అయినప్పటికీ అలసత్వం ప్రదర్శించకుండా కష్టపడాలని బాబు నేతలకు సూచిస్తున్నారు. అయితే, జనసేనతో పొత్తులు ఉండటంతో ఏయే స్థానాలను ఆ పార్టీకి కేటాయించాలనే విషయంపైనే తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచనలు చేస్తున్నారు. తప్పక గెలుస్తామనే నమ్మకమున్న 53 స్థానాల్లో నుండి జనసేనకు సీట్లు కేటాయించాలా లేదంటే, జనసేన పార్టీకి సొంతంగా బలం ఉన్న స్థానాలను కేటాయించాలా అనే దానిపైనే స్పష్టత రావాల్సి ఉన్నది. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నదో అక్కడే జనసేన కూడా బలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక, రాయలసీమలో వైసీపీ బలంగా ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోవచ్చని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాయలసీమలో జనసేన రాయలసీమ, ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ కొంతమేర బలం పుంజుకున్నది. జనసేన పార్టీ కూడా తమకు 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరే అవకాశం ఉన్నది. లోక్ సభలోనూ 12 స్థానాల నుండి పోటీ చేయవచ్చు.
ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండటంతో త్వరలోనే పొత్తులను, సీట్ల సర్ధుబాట్లను ఖరారు చేసుకొని ప్రచారం చేపట్టే అకవాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం వైసీపీని ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యమని బలంగా చెబుతున్నారు. మరి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా? పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పినట్లుగా జగన్ పార్టీని సాగనంపుతారా? వేచి చూద్దాం. అటు వైసీపీ సైతం వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు.