Chandraababu Naidu: ఉత్తమ నాయకుడు ఎన్టీఆర్.. ఉత్తమ విధ్వంస కారుడు జగన్మోహన్ రెడ్డి..చంద్రబాబు
Chandraababu Naidu: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల రగడ రోజురోజుకు పెరిగిపోతుంది. వైసీపీ ,టీడీపీ ,జనసేన ఈమూడుపార్టీలు నువ్వా -నేనా అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో మూడుపార్టీల నాయకులూ రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా చలోక్తులు,విమర్శలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఏపీ సీఎం ని సైకోతో పోల్చాడు. సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలని అన్నాడు.
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయనకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం రాష్ట్రంలో నడుస్తోందని, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనొక సైకో అంటూ తీవ్ర విమర్శలు చేసారు. ఉత్తమ పాలనకు సృష్టికర్త ఎన్టీఆర్ అయితే.. ఉత్తమ విధ్వంస కారుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు భావితరాల భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ తపించారన్నారు.
ఓటమి భయంతోనే అధికారపార్టీ పోలీసుల ద్వారా చావు కుట్రలు పన్ని జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందన్నారు. ఆ జీవోను ప్రతిఒక్కరూ వ్యతిరేకించారని చంద్రబాబు పేర్కొన్నారు. పండగపూట ఏతప్పుచేయని టీడీపీ నాయకులను జైలుపాలు చేసిన దుర్మార్గపు వ్యక్తి జగన్ రెడ్డి అంటూ తీవ్రపదజాలంతో దూషించాడు.