TDP : సమన్వయ కమిటీ నియామకం… సభ్యులు ఎవరంటే ?
టీడీపీ ఇప్పటినుంచే వచ్చే ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ మేరకు చురుకుగా కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే అంతకన్నా ముందు పార్టీలో నేతల మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమన్వయ కమిటీని నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా టీడీపీలో సమన్వయ కమిటీ నియామకం జరిగింది. కమిటీ సభ్యులకు నేతల మధ్య నెలకొన్న విబేధాల పరిష్కార బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీలో సభ్యులుగా అచ్చెన్నాయుడు, బచ్చుల అర్జునుడు, యనమల రామకృష్ణుడు, టి.డి.జనార్దన్, దామచర్ల సత్య ఉన్నారు. కమిటీ తొలి సమావేశంలో నేతలు ఎవరైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారాన్ని కమిటీ సభ్యులకు చంద్రబాబు అప్పగించారు.