టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు(Daggubati Venkateswara Rao), ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeshwari)తో కలిసి మరోసారి జేపీ నడ్డా(Nadda)తో భేటీ అవడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
Chandrababu met Nadda : దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు (NT Rama Rao)శత జయంతి సందర్భంగా ..ఎన్టీఆర్(NTR) చిత్రంతో ఉన్న రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) రిలీజ్ చేశారు. రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి.. చంద్రబాబు నాయుడు(Chandrababu),బీజేపీ చీఫ్ జేపీ నడ్డా(BJP chief JP Nadda) హాజరయ్యారు. ఈ సమయంలో జేపీ నడ్డా(JP Nadda) పక్కనే కూర్చున్న చంద్రబాబు.. ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఏపీలోని ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల(Political developments)తో పాటు..పొత్తుల అంశం గురించి చంద్రబాబు(Chandrababu) ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతేకాదు..ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం.
మరోవైపు చంద్రబాబు(Chandrababu) తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు(Daggubati Venkateswara Rao), ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeshwari)తో కలిసి మరోసారి జేపీ నడ్డా(Nadda)తో భేటీ అవడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో చంద్రబాబు నాయుడు ఏదో చెబుతూ ఉండగా.. జేపీ నడ్డా టీ తాగుతూ ఆసక్తిగా వింటున్నారు. మరోవైపు ఈ భేటీలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పాటు సీఎం రమేశ్ కూడా ఉన్నారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు..ఇప్పుడు ఒక్కసారిగా తోడల్లుడు చంద్రబాబు పక్కన కూర్చోవడం.. జేపీ నడ్డాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తున్న ఫోటోలు వైరల్ కావడంతో.. ఏపీ రాజకీయాల్లో ఏదో జరగబోతుందనే చర్చ జోరందుకుంది.