Chandrababu: ఎనీ డౌట్ – పవన్ క్లియర్ గా చెప్పేసారు
Chandrababu Interesting Comments on Pawan Kalyan: సంక్రాంతి సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లి వెళ్లిన ఆయన అక్కడ తన నివాసంలో మీడియాతో చంద్రబాబు ముచ్చటించారు. ఇక ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పై బాబు హాట్ కామెంట్స్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పాడని అయినా ఎందుకు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని తిడుతున్నారు?ఎందుకు అంత భయం? ఎందుకు అంత పిరికితనం? అని ప్రశ్నించారు. అధికారం ఉందని అహంకారం మంచిది కాదు, ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సంక్రాంతి ఒక ఆశను, భవిష్యత్తు కోసం పోరాడే శక్తిని ఇస్తుందని పేర్కొన్న ఆయన అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారని అన్నారు.
సేవాభావం ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలన్న బాబు తప్పు చేస్తూ ఎదురుదాడి ద్వారా కప్పి పుచ్చుకుంటున్నారని అన్నారు. కేసులకు భయపడే పరిస్థితి లేదు…కార్యకర్తలు తెగించి రోడ్డుపైకి వస్తున్నారని బాబు అన్నారు. జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురిచేసి లొంగిపోరన్న ఆయన ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టకూడదు కానీ, వైసీపీ మాత్రం పెట్టుకోవచ్చా అని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా పోరాటం ఆగదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటానని బాబు అన్నారు. వ్యవస్థలన్నిటినీ సర్వనాశనం చేశారని పేర్కొన్న ఆయన విధ్వంసానికి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన ప్రభుత్వమిదేనని అన్నారు.