CBN PK Meet: పొత్తులపై సరైన సమయంలో – మా వ్యూహాలు పక్కా
Chandrababu Comments on Pawan Meeting: టీడీపీ, జనసేన పొత్తు పై చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. సరైన సమయంలో పొత్తులు గురించి చర్చ ఉంటుందన్నారు. తమ వ్యూహాలు తమకు ఉన్నాయని వెల్లడించారు. పొత్తులగురించి చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల్లో రెండు పార్టీలు కలవటం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. వైఎస్సార్ పార్టీ గుండాలతో గొడవ చేయిస్తున్నారని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు గంజాయి, డ్రగ్స్ వినియోగం ఏపీలో ఎక్కువైందని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ నాశనం అయ్యాయని పేర్కొన్న ఆయన 40 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. 40 ఏళ్లలో ఇలాంటి చర్యలు ఎప్పుడు చూడలేదని, ఎమర్జన్సీలో కూడా ఇలాంటివి చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ భ్రష్టు పట్టించిందని, పోరాడితే దాడులు చేయించడం పనిగా పెట్టుకున్నారని అన్నారు.
అన్ని పార్టీలు ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని బాబు పేర్కొన్నారు. జీవో నెంబర్ 1 కరెక్ట్ కాదన్న బాబు, చేతనైతే ప్రజలను సీఎం మెప్పించుకోవాలని అన్నారు. కానీ జగన్ పరదాలు కట్టుకుని పోతున్నాడని అన్నారు. నువ్వు బలవంతంగా మీటింగులు పెట్టుకుంటావని జగన్ ను ఉద్దేశించి పేర్కొన్న ఆయన సొల్లు కబుర్లు చెప్పాలని వాళ్లని హింసిస్తూన్నావు, అలాంటిది ప్రజల కోసం పోరాడే మేము మేము మీటింగ్ పెట్టుకోవద్దా అని ప్రశ్నించారు. విశాఖలో ఆంక్షలు పెట్టి పవన్‌ను హింసించారని, ఇప్పటంలో పవన్ సభకు స్థలం ఇస్తే ప్రజల ఇళ్లను కూల్చేశారని అన్నారు.
విశాఖలో నన్ను కూడా అడ్డుకున్నారఇన్, జీవో నెం.1 పరిణామాలను ముందుగానే విశాఖలో చూశామని అన్నారు. కుప్పం వెళ్తానంటే నాకే అడ్డంకులు సృష్టించారు, వైసీపీ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు ఘటనలు అని బాబు అన్నారు. కందుకూరు ఘటన పోలీసుల కుట్ర కాదని చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించిన బాబు కుట్ర, కుతంత్ర రాజకీయాలు తిప్పికొడతామని అన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే మా ఆఫీస్‌పై దాడులు చేశారని, అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటైందని, దాంతో ఇక అన్ని రకాల పోరాటాలు చేస్తామని బాబు అన్నారు.