Chandrababu: ఆ విషయం నాతో చెప్పి రాజా బాధ పడ్డారు: చంద్రబాబు!
Chandrababu: ప్రత్తిపాడు టీడీపీ నేత వరుపుల రాజా భౌతిక కాయానికి చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు నివాళులర్పించారు. శనివారం నాడు రాత్రి గుండెపోటుతో వరుపుల రాజా గుండెపోటుతో మృతి చెందగా ఈ మధ్యాహ్నం ప్రత్తిపాడులోని వరుపుల రాజా భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. రాజా కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు. అయితే వరుపుల రాజా భార్య సత్యప్రభ ను ప్రత్తిపాడు ఇంచార్జ్చాగా ప్రకటించాలని చంద్రబాబు ముందు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని బాబు చెప్పినా వదినమ్మ కి టికెట్ ప్రకటించాలని క్యాడర్ నినాదాలు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపులు వలన రాజా ఆందోళన చెందారని, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ కూడా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం రాజా పై 12 కేసులు పెట్టిందని ఈ కేసులు పై నాతో చెప్పి రాజా బాధ పడ్డారని ఆయన అన్నారు, ఆ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని బాబు అన్నారు.