Chandrababu and Jagan to Support Modi: మోడీనే కావాలంటున్న బాబు జగన్
Chandrababu and Jagan to Support Modi: రాజకీయాలను అర్థం చేసుకుంటే ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. రాజకీయ నాయకులు చెప్పినట్లుగా పాలిటిక్స్‌లో పర్మినెంట్ మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు. అవసరానికి తగ్గట్టుగా మిత్రులు, శతృవులు మారుతుంటారు. అయితే, ఒక రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఎప్పుడూ శతృత్వం ఉంటుంది. ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు పోరాటం చేస్తూనే ఉంటాయి. ఇలాంటి రెండు పార్టీల్లో ఒకటి తెలుగుదేశం కాగా రెండోది వైసీపీ. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కాగా, వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ప్రచారం మొదలు పెట్టాయి. తాము అధికారంలోకి వస్తామంటే తామే అధికారంలో ఉంటామని రెండు పార్టీలు చెబుతున్నాయి.
అయితే, రెండు పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ముందస్తు సర్వేలు స్పష్టం చేయడంతో మోడీని ప్రసన్నం చేసుకునేందుకు రెండు పార్టీలు ఢిల్లీ చుట్టూ చెక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబుతో కలిసి పనిచేయబోమని గతంలో కమలనాధులు కుండబద్దలు కొట్టారు. అయితే, ఎన్నికల సమయానికి ఏమైనా జరగొచ్చు. అదేవిధంగా వైసీపీతో చేతులు కపడం కూడా కమలానికి ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే, సంక్షేమం పేరుతో ఉచిత పథకాలను అమలు చేస్తూ నిధులను యడాపెడా ఖర్చుపెడుతున్నారని సీఎం జగన్ ను విమర్శిస్తున్నారు. ఈ సమయంలో జగన్‌తో కలిసి ముందుకు సాగడం కష్టమే. కానీ, చంద్రబాబు, వైఎస్ జగన్‌ను ఇద్దరి చూపులు మోడీవైపే ఉన్నాయి. మరి మోడీ చూపులు ఎవరిమీద ఉన్నాయో చూడాలి.