AP MLC Counting: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తం, అధికారులకు చంద్రబాబు ఫిర్యాదు
Chandra Babu Naidu complaint to Election officials about untowards incidents at MLC Counting Centers
ఏపీలో గ్రాడ్యయేట్స్ 3 స్థానాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో TDP హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, YSRCP పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు
కౌంటింగ్ కేంద్రాల్లో, నిబంధనల అమలు, అక్రమాల నివారణపై జిల్లా అధికారులకు, ఎన్నికల అధికారులకు చంద్రబాబు ఫోన్ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి M.K. మీనా, అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ, ఎస్పీ ఫకీరప్ప లతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన పలు అంశాలను వారికి వివరించారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్ లోకి ఎటువంటి పాసులు లేకుండా చొరబడి…టీడీపీ వారిపై దాడులకు దిగిన వైసీపీ శ్రేణులపై తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను కోరారు.
పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ సిద్దమైందని ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని అధికారులను చంద్రబాబు కోరారు.